Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్... మధ్యాహ్నం విచారణ!

చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 మంది ఎర్రచందనం కూలీలు దుర్మరణం పాలైన ఈ ఘటనపై ఇప్పటికే తమిళులు నిరసనలు కొనసాగిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో ఈ ఘటనపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఓ న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు నేటి మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వం, డిజీపీ, స్పెషల్ ఆపరేషన్స్ డిజీలను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు.

More Telugu News